ఉమ్మడి మహబూబ్​నగర్​ పెండింగ్ ప్రాజెక్టులే లక్ష్యంగా నేడు సీఎం సమీక్ష- జిల్లా ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు

2024-07-09 65

CM Focus On projects in palamuru : పాలమూరు జిల్లా పేరుచెప్తే గుర్తుకొచ్చేవి వలసలు, పెండింగ్ ప్రాజెక్టులే. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా దశాబ్దాలుగా పూర్తికాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై పలుమార్లు జిల్లా మంత్రులు, ఇంఛార్జ్​ మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై పాలమూరు జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.