Telangana Phone Tapping Case Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో హైదరాబాద్ రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అరైస్టయిన నలుగురు అధికారుల వాంగ్మూలాలు, కొన్ని ధ్వంసమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించట్లేదు. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులను విచారించి, కేసును కొలిక్కి తేవాలని అధికారులు పట్టుదలగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం సహకరించట్లేదు.