Telangana Budget 2024 : వార్షిక బడ్జెట్ కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన సర్కార్, ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రగతి పద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధుల సర్దుబాటు చేయనుంది.