ప్రభుత్వ లాంఛనాలతో నేడు డీఎస్​ అంత్యక్రియలు - హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

2024-06-30 315

D Srinivas Funeral in Nizamabad 2024 : మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌ మరణంతో నిజామాబాద్‌ జిల్లా రాజకీయ వర్గాల్లో విషాదం ఏర్పడింది. రాజకీయాల్లో జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న డీఎస్‌(76) మరణం ఆయన అనుచరులు, కార్యకర్తలకు తీరని లోటు ఏర్పడింది. హైదరాబాద్‌లో గుండెపోటుతో చనిపోగా, నిజామాబాద్‌ లోని స్వగృహానికి డీఎస్ మృతదేహం తరలించారు. ఇవాళ నిజామాబాద్‌ నగర శివారులోని వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది.