గ్లాస్​ పరిశ్రమలో గ్యాస్​ కంప్రెషర్​ పేలుడు - అయిదుగురు దుర్మరణం

2024-06-28 84

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్‌ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి అయిదుగురు మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేశ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.