Blast in South Glass Factory Shadnagar : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఆరుగురు మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.