ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు- మండుతున్న కూరగాయల ధరలు

2024-06-28 152

రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం, నైరుతి రుతు పవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం, కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ఫలితంగా ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రైతుబజార్లతో పోలిస్తే చిల్లర మార్కెట్‌లో ఏకంగా 60 శాతం వరకు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా ఉత్పన్నమవుతున్న ఈ అనుభవాల నేపథ్యంలో కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు సర్కారు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించింది