Andhra Pradesh Cabinet Meeting 2024 : జులై నెల పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. సచివాలయంలో తొలిసారి సమావేశమైన కేబినెట్, సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోదముద్ర వేసింది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. గంజాయి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో పాటు, 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఆగస్టులో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది.