CM Chandrababu Comments on YSRCP: దేవుడి స్క్రిప్ట్ వల్లే వైఎస్సార్సీపీ 11 సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు ధైర్యంగా తాము సభకు వచ్చామని కానీ నేడు పిరికితనంతో జగన్ పారిపోయారని అన్నారు. అవహేళన చేసిన కౌరవసభను గౌరవ సభగా మార్చిన తర్వాతే సీఎంగా సభలో అడుగుపెడతానన్న తన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.