వైఎస్సార్​సీపీ అక్రమ నిర్మాణాల కూల్చివేత

2024-06-22 1,090

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్‌ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.