Telangana Civil Supplies Corporation : రాష్ట్రంలో రైస్‌మిల్లర్లు ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం రిసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవని, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.