రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. రోడ్ల వెంట ఉన్న దుకాణాలు మొదలు, ఏ మార్కెట్‌కు వెళ్లినా కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పెరుగుతున్న రేట్లు పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తక్కువ వచ్చి కూరగాయల కొరత ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలతో అధికంగా పంట నష్టం జరిగింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. మార్కెట్‌లో మండుతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు.