బిహార్‌లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. అరారియా జిల్లాలోని బక్రా నదిపై కుస్రా కాంతా-కిస్రీ ప్రాంతాలను కలుపుతూ ఓ వంతెనను నిర్మించారు. అయితే, ఈ వంతెన మంగళవారం అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపోయింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.