IND vs PAK - Virat Kohli శ్రమించినా ఫలితం లేదు , అతనివల్లే భారత్ ఓటమి

2022-09-04 17,557

IND vs PAK - Pakistan beat India by 5 wickets in thriller for the ages

ఆసియాకప్ 2022లో భారత జోరుకు బ్రేక్ పడింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో టీమిండియా ఓటమిపాలైంది. ముఖ్యంగా కీలక సమయంలో అర్ష్‌దీప్ సింగ్ చేజార్చిన క్యాచ్ భారత్ కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28), కేఎల్ రాహుల్(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.


#IndiavsPakistan
#AsiaCup2022
#India
#ViratKohli
#BCCI
#RiohitSharma