రానున్న మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు *Telangana

2022-07-12 103

Heavy rains in Telangana. The Meteorological Department says that there is a chance of moderate to heavy rains in 21 districts of telangana today | వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, రానున్న మూడు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు.