కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డ బాల్క సుమన్ *Politics

2022-07-02 124

PM Modi Hyderabad Visit: Balka Suman made Sensational comments on PM Modi And Union Minister Kishan Reddy | తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ పై, బీజేపీ నాయకుల పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రపదజాలంతో తిట్టిపోశారు.ఎనిమిదేళ్లుగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిని ఢిల్లీలోని కార్యాలయాల్లో కనీసం గుమస్తాలు కూడా గుర్తు పట్టరని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పుట్టుకనే మోదీ అపహాస్యం చేస్తే కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలన్నారు.


#PmmodiHyderabadvisit
#BalkaSuman
#Congress