విజయనగరం జిల్లా శృంగవరపుకోటమండలం బౌడార, తాటిపూడి కొండను అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. బౌడార గ్రామ సమీపంలో గత రాత్రి రెండు ఆవులపై దాడి చేసిందని, అందులో ఓ ఆవు మరణించిందని స్థానికులు చెపుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.