దర్శకేంద్రుడు కే Raghavendra rao తెనాలి పెమ్మసాని థియేటర్ లో సందడి చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలికి వచ్చిన ఆయన పెమ్మసాని థియేటర్ లో వేటగాడు సినిమాను అభిమానులతో కలిసి వీక్షించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాఘవేంద్రరావుతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజా, రచయిత బుర్రా సాయిమాధవ్ ఉన్నారు.