TeluguDesam Party అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఉండే ప్రజావేదికను కూల్చి 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వారందర్నీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.