అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద నాలుగేళ్లు పనిచేసి, పదవీ విరమణ పొందిన అగ్నివీరులకు రక్షణ శాఖలో ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్‌కు అదనంగా ఉంటుందన్నారు. అవసరమైన సవరణలు చేపట్టామన్నారు.