ఆదిలాబాద్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ సోషల్ మీడియా పోస్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరి మనోభావాలు దెబ్బతీసేలా పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని... పట్టణంలో ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.