BJYM Leaders Dharna At Jubilee Hills: మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితుల అరెస్టుకు డిమాండ్

2022-06-06 6

హైదరాబాద్ లో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచార కేసు నిందితులను అరెస్ట్ చేయాలంటూ BJYM నాయకులు ధర్నా చేపట్టారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వీరు ఆందోళనకు దిగటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వీఐపీ జోన్ కావటంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. BJYM అధ్యక్షుడు భానుప్రకాశ్ కూడా ఇందులో ఉన్నారు. వారందరినీ గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.