జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.కౌలు రైతులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో మూడువేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. గొప్ప మనసున్న వ్యక్తి పై మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై లోకల్, నాన్ లోకల్, ఇంటర్నేషనల్ మంత్రి అమర్ అనడం పై జనసేన కార్యకర్తలు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి గతంలో ఎన్ని పార్టీలు మార్చారో గుర్తు చేసుకోవాలన్నారు. యువతికి ఉద్యోగాలు, కౌలు రైతుల సమస్యలు పై దృష్టి పెట్టాలని హితవు పలికారు.