జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డడారు. ఇంటి పన్ను కట్టలేదన్న కారణంతో పట్టణంలోని పురాణి పెట్‌లో ఉన్న హైమద్ బిన్ సాలెం ఇంటి ముందు ట్రాక్టర్‌తో తీసుకొచ్చి చెత్త పారబోశారు. పన్ను కట్టాలని చాలా నెలలుగా కోరుతున్నా పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో కార్మికులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని మున్సిపల్ కార్మికులతో వాగ్వాదానికి దిగాడు. ఇంటిపై రూ.లక్షకు పైగా పన్ను ఉందని అధికారులు చెబుతుంటే.. తాను రూ.25వేలు మాత్రమే కడతానని ఇంటి యజమాని చెబుతున్నారు.