విశాఖపట్నం కేజీహెచ్‌లో బుధవారం రాత్రి అపహరణకు గురైన పసికందు లభ్యమైంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగి దగ్గర కారులో తరలిస్తున్న పసిపాపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక గ్రామానాకి చెందిన మాదిన రాజేష్, మాదిన లక్ష్మీ ప్రసన్న, మరో మహిళ కలిసి పసికందును కారులో తీసుకెళ్తుండగా కోటబొమ్మాళి ఎస్‌ఐ పట్టుకున్నారు. టవర్ లొకేషన్ ఆధారంగా పాప ఆచూకీని గుర్తించారు. పసికందును స్వాధీనం చేసుకుని శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నంకు తరలించనున్నారు.