రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టు పల్లి, మన్‌సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగ్ ట్రే తయారీ కేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బహదూర్ గూడ గ్రామానికి చెందిన భారత్ రెడ్డి(27) అనే వ్యక్తి ఓ గోడౌన్ లీజుకు తీసుకుని ఎగ్ ట్రే తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం రాత్రి కొందరు దుండగులు దానికి నిప్పు పెట్టడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఉలిక్కిపడిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అయితే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పగిలిన పైపులతో మంటలను ఆర్పేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు కొద్ది నిమిషాలతో ఫైరింజన్‌లో నీళ్లు అయిపోవడంతో చేతులెత్తేశారు. దీంతో స్థానికులు వారిపై మండిపడ్డారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.2కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుతు భరత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.