అలా జాగ్రత్తలు పాటించకపోతే డయాబెటిస్‌తో కళ్లు పోతాయ్!

2022-03-01 10

మధుమేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అది చేసే డ్యామేజ్ అంతాఇంతా కాదు. డయాబెటిస్ అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవి కనిపించవు. రెటినోపతిలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే.. ముందుస్తు పరీక్ష ఒక్కటే మార్గం.