జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా కోసం ఆయన సామాజికవర్గానికి చెందినవారే రెండు రోజులు హడావుడి చేశారన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. రూ.50 కోట్లు, రూ.100 కోట్లు తీసుకునే హీరోలు ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే హీరో కాదు.. అందరూ హీరోలే.. అసలు హీరోల్లో ప్రజాసేవ చేసిన వాళ్లే లేరన్నారు. ప్రజానాయకుడు ప్రజా సేవకు ముందుకు రావాలని.. పవన్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. అలా అయితే అందులో సంగం రూ.50 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేయాలన్నారు.పేదోడు బాగుపడాలనే సీఎం జగన్ సినిమా టికెట్ రేట్లు తగ్గించారని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇదే టికెట్ రేట్లు వర్తించాయన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. అఖండ, పుష్ప, బంగార్రాజు సినిమాలపై ఎందుకు స్పందించలేదని.. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఇబ్బంది వచ్చిందా.. పవన్ సినిమా అయితే బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోనివ్వాలా అన్నారు.