పహాడీషరీఫ్‌లో కలకలం రేపిన కాల్పుల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. హరియాణాకు చెందిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌లో దోపిడీకి పాల్పడింది. ఓ లారీ డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి లారీలో ఉన్న రూ.44 లక్షల విలువైన టైర్లను చోరీ చేశారు. దోపిడీకి పాల్పడిన తర్వాత దొంగలు బిందాస్‌గా విమానంలో హరియాణాకు పారిపోయారు. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ అధికారుల సహకారంతో దోపిడీ దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. గ్యాంగ్‌లోని నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.