IND vs NZ : రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్‌ అదిరేనా, Kohli ఆడినా, ఆడకపోయినా ? || Oneindia Telugu

2021-11-17 181

If a player fails while trying to perform assigned role, we will still give him confidence: Rohit Sharma
#INDvsNZ
#RohitSharma
#RahulDravid
#TeamIndia
#BCCI

జట్టులోని ప్రతి ఒక్కరు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా చూస్తానని భారత టీ20 కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. బాగా ఆడినా, ఆడకపోయినా మీకు అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తామన్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ చాలా కీలక ఆటగాడని, టీమ్ అవసరాలను బట్టి అతడి సేవలను ఉపయోగించుకుంటామని రోహిత్ చెప్పాడు. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన ప్రస్తుతం లేదని టీమిండియా హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ అన్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ ముందు.. రాహుల్ ద్రవిడ్‌, రోహిత్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.