T20 World Cup 2021: MS Dhoni Fails Big Time As Mentor For Team India In T20 World Cup 2021.
#T20WorldCup2021
#IPL
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#MSDhoniMentor
#RohitSharma
#ViratKohli
టీ20 ప్రపంచకప్ ముందు భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ విన్నర్ మహేంద్ర సింగ్ ధోనీని జట్టు మెంటార్‌గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. ధోనీ చేరికతో టీమ్‌మేనేజ్‌మెంట్ వ్యూహాలు గతి తప్పాయి. చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి. విరాట్ కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రి మధ్య ఏకాభిప్రాయం కుదరకనో లేక ప్రణాళికలు కలిసిరాకపోవడమో తెలియదు కానీ టీమిండియా మాత్రం మూల్యం చెల్లించుకుంది. పొట్టి ఫార్మాట్‌లో ద్వైపాక్షి సిరీస్‌ల్లో దుమ్మురేపిన టీమిండియా.. అత్యున్నత వేదికగా మాత్రం దారుణంగా విఫలమైంది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు చెత్త ఆటతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిని తెచ్చుకొంది. మహేంద్రుడి మాయజాలం పనిచేయలేకపోగా.. అతని మెంటార్‌షిప్ జట్టు వైఫల్యానికి కారణమైనట్లు తెలుస్తోంది.