The Indian Premier League 2022 will have two new franchises competing for the trophy. The IPL governing body had invited bids to acquire the right of two new teams for the upcoming season.
#IPL2022
#IPL2022Auction
#NewIPLTeams
#ManchesterUnited
#Ahmedabad
#Lucknow
#AdaniGroup
#BCCI
#Cricket
ఐపీఎల్ ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని బీసీసీఐ గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్‌లో మొత్తంగా 10 జట్లు ఆడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రెండు కొత్త జట్లకు సంబంధించి టెండర్లను బీసీసీఐ పిలవాలనుకున్నా.. వివాద కారణాల వల్ల కాస్త ఆలస్యం అయింది. చివరకు ఈరోజు బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. దాదాపు 10కి పైగా కార్పొరేట్ సంస్థలు రెండు జట్ల కోసం బిడ్లను సమర్పించాయని తెలుస్తోంది. దుబాయ్‌లోని తాజ్ దుబాయ్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్‌ను అదానీ గ్రూప్, లక్నోని మాంచెస్టర్ యునైటెడ్ కైవసం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుందట.