Rahul Dravid likely to be roped in as Team India's interim head coach for New Zealand series: Report
#TeamIndiaheadcoach
#RahulDravid
#T20Worldcup
#IPL2021
#ViratKohli
#INDVSNZ
భారత మాజీ సారథి, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి భారత జట్టును నడిపించనున్నాడని సమాచారం తెలుస్తోంది. ద్రవిడ్ టీమిండియా తాత్కాలిక కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌కు ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నిస్తోందని బోర్డు వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. అతి త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది.