All those who were mistaken for Ashwin questioned why Rishabh Pant was not deposed. In a column for a newspaper, How wrong was Ashwin in this run .. Pant also said that it was the same. Ashwin said that when he tried for a run, he did it, and so did his character. Gavaskar was of the view that Pant should be prevented from running.
#IPL2021
#RAshwin
#RishabhPant
#SunilGavaskar
#EoinMorgan
#KKRvsDC
#DelhiCapitals
#TimSouthee
#DineshKarthik
#Cricket
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై స్పందించిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌ను తప్పుబడుతున్నవారంతా రిషభ్ పంత్‌ను ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించాడు. మిడ్-డే దినపత్రికకు రాసిన కాలమ్‌లో ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ అశ్విన్‌ను వెనకేసుకొచ్చాడు. ఈ పరుగు విషయంలో అశ్విన్‌ది ఎంత తప్పుందో.. పంత్‌ది కూడా అంతే ఉందన్నాడు. అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించినప్పుడు పూర్తి చేసింది పంతేనని, అతని పాత్ర కూడా ఉందన్నాడు. పంత్ పరుగు తీయకుండా అడ్డుకోవాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.