T20 WC: Shreyas Iyer కంటే బెటర్ గా Suryakumar లాప్‌, లేట్‌ కట్‌, ఎక్స్‌ ట్రా కవర్ షాట్‌లతో

2021-09-11 172

Former cricketer Gautam Gambhir has explained why the BCCI preferred to keep Suryakumar Yadav in the final 15 and kept Shreyas Iyer on the reserved list
#T20WC2021
#SuryakumarYadav
#TeamIndiaWorldcupSqad
#GautamGambhir
#ShreyasIyer
#INDVSENG

టీమిండియా యువ క్రికెటర్‌ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్య అసాధారణమైన ఆటగాడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడాడు. టీ20 ఫార్మాట్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని మెళకువలు అతనిలో ఉన్నాయన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో పోల్చి చూస్తే సూర్యకుమార్‌ ఎంతో ప్రతిభావంతుడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కగా.. శ్రేయస్ అయ్యర్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. అయితే అయ్యర్ ప్లేస్‌లో సూర్యకు అవకాశం దక్కింది. అయ్యర్ బదులు సూర్యను తీసుకోవడానికి గల కారణాన్ని గంభీర్ వివరించాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 'ఫాలో ద బ్లూ'షోలో మాట్లాడుతూ.. సూర్య అన్ని రకాల షాట్లు ఆడగలడని తెలిపాడు.