Schools Reopening ఆలోచన మంచిదే... కానీ పిల్లలకు వైరస్ సోకితే ? | COVID 19 || Oneindia Telugu

2021-08-12 5,624

Andhrapradesh government is ready To reopen schools from next week amid covid 19 third wave, that leads to fears in parents and children.
#SchoolsReopening
#Andhrapradeshgovernment
#APCMYSJagan
#covid19thirdwave
#Students
#parents
#CovidVaccination

ఏపీలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. సెకండ్ వేవ్ ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంకా ప్రతీ జిల్లాలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో ఆగస్టులో కరోనా ధర్డ్ వేవ్ తప్పదన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అయితే వైసీపీ సర్కార్ మాత్రం స్కూళ్లు తెరిచేందుకే మొగ్గుచూపుతోంది. ఏపీలో కరోనా ప్రభావం గతంలో పోలిస్తకే కాస్త తగ్గడంతో పాఠశాలలు, విద్యాసంస్ధల్ని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం.. స్కూళ్లు తెరిచే నాటికి అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. దీంతో స్కూళ్లకు వచ్చే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెబుతోంది.

Free Traffic Exchange