India vs srilanka : Here’s Why Sanju Samson Is Not Playing The First ODI

2021-07-19 77

India vs srilanka : Here’s Why Sanju Samson Is Not Playing The First ODI Against Sri Lanka
#Teamindia
#Indvssl
#sanjuSamson
#Ishankishan

ప్రేమదాస మైదానంలో శ్రీలంక‌, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇద్దరు కుర్రాళ్లు అరంగేట్రం చేశారు. యువ కెరటం ఇషాన్‌ కిషన్‌, 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు. చాన్నాళ్ల తర్వాత కుల్దీప్ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌ కలిసి ఆడుతున్నారు. శిఖర్‌ ధావన్‌తో పాటు యువ ఆటగాడు పృథ్వీ షా ఓపెనింగ్‌ చేయనున్నాడు. ఇక భారత జట్టులోకి మొదటిసారి ఎంపికైన నితీష్ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌లకు నిరాశే ఎదురైంది. వీరితో పాటు సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌‌కి అవకాశం దక్కలేదు. సంజుకు తుది జట్టులో చోటు ఇవ్వకపోడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.