IPL 2022 : If MS Dhoni Doesn’t Play, I Too Won't Play : Suresh Raina

2021-07-10 352

Suresh Raina said he would try his best to convince MS Dhoni to play in IPL 2022 if CSK manage to win the title this year but that he will also retire if he cannot.
#SureshRaina
#IPL2022
#MSDhoni
#IPL2021
#CSK
#ChennaiSuperKings

టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడకుంటే తాను కూడా ఆడనని తెగేసి చెప్పాడు. ఒకవేళ తమ జట్టు ఐపీఎల్ 2021 సీజన్ గెలిస్తే.. తదుపరి సీజన్ ఆడేలా ధోనీని ఒప్పిస్తానన్నాడు. క్రికెటర్‌గా చివరి క్షణం వరకు సీఎస్‌కే టీమ్‌కే ఆడాలనుకుంటున్నానని, అవకాశం దక్కకుంటే మరో టీమ్‌ తరఫున బరిలోకి దిగే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాలతో గత ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా.. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు.