Teamindia Coach : పీకేయాల్సిన పనిలేదు - Kapil Dev

2021-07-05 95

Kapil Dev back THIS man in Ravi Shastri vs Rahul Dravid coach debate
#Teamindia
#RahulDravid
#RaviShastri
#Bcci
#KapilDev
#Indvssl
#Indvseng

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఇది పురోగతిని కొనసాగిస్తే అతన్ని తప్పించాల్సిన పనిలేదని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత బీ జట్టుతో దిగ్గజ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక పర్యటనకు వెళ్లడంతో సోషల్ మీడియా వేదికగా రవిశాస్త్రిని పదవి నుంచి తప్పిస్తారా? అనే చర్చ ఊపందుకుంది. పైగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో లంక సిరీస్‌కు ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.