NSUI Leader Venkat తో ముఖాముఖి, మల్లారెడ్డి పై ఫైర్.. చూస్తూ ఊరుకోం!!

2021-05-14 1

Nsui leader Venkat warning to minister Mallareddy.
#NSUI
#Telangana
#Trsparty
#Ktr
#Kcr
#Mallareddy

రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తో సహా 12 మంది ఎన్ఎస్ యూఐ నాయకులకు బెయిల్ మంజూరు కావడంతో వారు విడుదలయ్యారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ముందు మెరుపు ధర్నా నిర్వహించారు ఎన్ఎస్ యూఐ నేతలు. మల్లారెడ్డి హాస్పిటల్ ను వెంటనే ఉచిత కరోనా హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ సారథ్యంలో ఎన్ఎస్ యూఐ నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అదే రోజు రాత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించిన నాయకులను బుదవారం బెయిల్ పై విడుదల చేసారు.