Who Is Abhimanyu Easwaran , The 25-Year Old Included In India’s Standby Squad For WTC Final?
#AbhimanyuEaswaran
#ViratKohli
#RohitSharma
#Pujara
#Pant
#Wtcfinal
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని శుక్రవారం ఎంపిక చేసింది. జట్టుతో పాటు నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. దేశవాళీల్లో మెరుగ్గా రాణించిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జన్ నాగ్‌వస్వల్ల వీరిలో ఉన్నారు. వీరంతా జట్టుతో పాటు ఇంగ్లండ్ వెళతారు. సిరీస్ మధ్యలో ఎవరికైనా గాయమైతే జట్టులో చేరే అవకాశం ఉంటుంది. ప్రసిద్, ఆవేశ్ ఖాన్ ఐపీఎల్ ద్వారా అందరికీ సుపరిచితమే. కానీ అభిమన్యు ఈశ్వరన్, అర్జాన్ ఇప్పటివరకు లీగ్ లో ఆడలేదు. వీరిద్దరూ దేశవాళీలో మాత్రం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అర్జాన్ గుజరాత్ లెఫ్టార్మ్ పేసర్‌గా సత్తాచాటుతుండగా.. ఈశ్వరన్ బెంగాల్ తరఫున బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు.