హోండా సిబి 500 ఎక్స్ బైక్ ను మొట్టమొదటిసారిగా 2013 లో దేశీయ మార్కెట్లో ప్రారంభించింది. కంపెనీ ఈ బైక్ ను ప్రారంభించిన వెంటనే దాని డిజైన్ మరియు ప్రాక్టికాలిటీ వంటి వాటితో వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత కంపెనీ ఈ బైక్ ని 2016 లో ఒకసారి అప్‌డేట్ చేసింది, తిరిగి 2019 లో కూడా ఈ బైక్ మరోసారి అప్డేట్ చేయబడింది. కొన్ని సంవత్సరాల పాటు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ఎదురుచూస్తున్న కొత్త హోండా సిబి 500 ఎక్స్ చివరకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది.
ఇటీవల ఈ కొత్త హోండా సిబి 500 ఎక్స్ బైక్ రైడ్ చేసే అవకాశం మాకు లభించింది. ఇది నగరంలో మరియు హైవేపై మంచి పర్ఫామెన్స్ చూపించింది. అయితే ఇప్పుడు ఈ బైక్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వంటి విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.