West Indies captain Kieron Pollard on Wednesday became only the third man to hit six sixes in an international over in his team’s four-wicket T20 victory over Sri Lanka.
#KieronPollard
#AkilaDananjaya
#WIvSL
#YuvarajSingh
#SixSixes
#ChrisGayle
#EvinLewis
#HerschelleGibbs
#Cricket
వెస్టిండీస్ భారీ హిట్టర్ కీరన్ పోలార్డ్ విధ్వంసం సృష్టించాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆంటిగ్వాలో జరిగిన తొలి టీ20లో పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. లంక లెగ్ స్పిన్నర్ అఖిల ధనుంజయ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విండీస్ కెప్టెన్ ఆరు సిక్సర్లు బాదాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదింది పోలార్డ్ మాత్రమే.