2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ

2021-03-02 614

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 2016 లో హిమాలయన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఈ మోటారుసైకిల్ అనేక సార్లు అప్డేట్స్ పొందింది. అదేవిధంగా 2020 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ అప్డేట్ చేయబడింది. ఇది గత ఏడాది ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది.

ఇదే క్రమంలో ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్ మరో సారి అప్డేట్స్ అందుకుంది. ఇప్పుడు ఈ కొత్త (2021) రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తో పాటు అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంది. 2021 లో అప్డేట్స్ పొందిన హిమాలయ యొక్క ఖచ్చితమైన మార్పులు తెలుసుకోవడానికి ఇటీవల ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ని మేము బెంగళూరు నగరంలో డ్రైవ్ చేసాము. కొత్త హిమాలయన్ బైక్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం..