Soorarai Pottru Enters Oscars race.
#SooraraiPottru
#Suriya
#Sudhakongara
#AparnaBalamurali
టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో స్టైలిష్ హీరో సూర్య నటించిన చిత్రం 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హద్దురా). కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, గుణిత్ మోంగా నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళీ నటించింది. అలాగే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కీలక పాత్రను పోషించారు. లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూసి ఉండడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.