ఇటీవల ఇండియన్ మార్కెట్లో రెనాల్ట్ తన కిగర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇందులో దాని బేస్ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు కాగా, టాప్-స్పెక్ ఆర్‌ఎక్స్‌జెడ్ ఎక్స్-ట్రోనిక్ సివిటి వేరియంట్ ధర రూ. 9.55 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి. వినియోగదారులు దీనిని 11,000 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు.
సరికొత్త రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీని ఒక రోజు డ్రైవ్ చేయడానికి మాకు అవకాశం లభించింది. ఈ కారు నిజంగా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సరికొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.