India vs England: Joe Root Says "Desperate To Be Part Of IPL", Was A Difficult Call To Opt Out Of Player Auction
#IPL2021
#EnglandcricketTeam
#JoeRoot
#ViratKohli
#RohitSharma
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలం నుంచి తప్పుకోవడం కఠినమైన నిర్ణయమే అని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరామం లేకుండా షెడ్యూల్ ఉండటంతో తప్పడం లేదన్నాడు. వేలంలో పాల్గొనేందుకు వచ్చే ఏడాది తప్పకుండా ప్రయత్నిస్తానని రూట్ వెల్లడించాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో శనివారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అది జో రూట్‌కు వందో టెస్టు. రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 218, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.