Syed Mushtaq Ali Trophy : Tamil Nadu Beat Baroda By 7 Wickets In Final To Clinch Title

2021-02-01 308

Tamil Nadu beat Baroda by seven wickets in the final of the Syed Mushtaq Ali T20 tournament to lift the title. Left-arm spinner Manimaran Siddharth took four wickets for 20 runs. This is Tamil Nadu's second title after the first one came in the inaugural season of the tournament, back in 2006-07.
#SyedMushtaqAliTrophy
#TamilNaduVsBaroda
#SyedMushtaqAliTrophyT20tournament
#TamilNaduBeatBarodaBy7Wickets
#MohammedAzharduddeen
#ManimaranSiddharth
#DineshKarthik

నిలకడైన ఆటతీరుతో తమిళనాడు జట్టు రెండోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని చేజిక్కించుకుంది. 2006-07 ఆరంభ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఆధ్వర్యంలోనే విజేతగా నిలిచిన తమిళనాడు జట్టు.. 13 ఏళ్ల తర్వాత అజేయ ఆటతీరుతో మరోసారి చాంపియన్‌గా నిలిచింది.‌ ఆదివారం అహ్మదాబాద్‌లోని మొతెరా మైదానంలో జరిగిన ఫైనల్‌లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎం సిద్దార్థ్‌ (4/20) బరోడాను వణికించాడు. కుర్రాళ్ల స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అగ్ర జట్లను వెనక్కి నెట్టి ముందంజ వేసిన బరోడా.. తుది పోరులో మాత్రం పేలవంగా ఆడింది.