Pushpa Release Date : మహేష్ తో మళ్ళీ క్లాష్? | Allu Arjun | Sukumar

2021-01-28 167

Allu Arjun and Rashmika Mandanna’s ‘Pushpa’ gets release date
#Pushpa
#AlluArjun
#Sukumar
#Rashmika
#RashmikaMandanna
#Devisriprasad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవగా.. కరోనా కారణంగా పలుమార్లు దీనికి ఆటంకం ఏర్పడింది. అయితే, ఇటీవల తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ మరోసారి ప్రారంభమైంది. ఏకధాటిగా సాగుతోన్న షూటింగ్‌లో చిత్ర హీరో అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్.