Perni Nani counters to TDP Cheif Chandrababu Naidu.
#PerniNani
#Andhrapradesh
#Ysrcp
#TDP
#Ysjagan
#Sec
రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మంత్రి పేర్నినాని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు విశ్వాసం కోసం నిమ్మగడ్డ మూర్ఖత్వంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించొద్దని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాలు కూడా సుముఖంగా లేవని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.